చిన్ని చిన్ని ఆశకు పేరడీ జోక్

చిన్ని చిన్ని ఆశకు పేరడీ జోక్

చిన్ని చిన్న దోశ

సన్నగా పోశా

ఉల్లిపాయ కోశా

అందులో వేశా

పైన వెన్నరాశా

తినమని కూశా

రావేలా ఈశా ఓ వేంకటేశా... || చిన్ని చిన్న దోశ ||

 

కూరతో బాటు

చెట్ని ఉండాలి

సాంబారు తోటి కలిపికొట్టాలి.

తినడానికంతా క్యూలు కట్టాలి

తిన్నవారంతా జేలు కొట్టాలి

స్వాదిష్ట సామ్రాట్ బిరుదనివ్వాలి || చిన్ని చిన్న దోశ ||