Antera Bamardee 10

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

అంతేరా బామ్మర్దీ - 10

“ఇది కొచ్చిన్-కొచ్చిన్లో జరిగిన సంఘటన సార్ " అన్నాడు పి.ఆర్వో చక్రపాణి.

“ఎక్కడ జరిగిందో అనవసరం.జరిగింది చెప్పు "అన్నాడు బసవరాజు.

“పశుపతి నాయర్ అనే ఫిప్టీ ఇయర్స్ ఇండస్ట్రియలిస్టుని "చెప్పడం మొదలు పెట్టాడు చక్రపాణి.

“కరెక్టుగా నా వయస్సే.నా వృత్తే "అన్నాడు బసవరాజు.

“కుమారన్ కుట్టి అనే నాయర్ ఫ్రండు.నాయర్ ఆఫీసుకి వచ్చి నాయర్ పీక పిసికి చంపేడు "

“ఘోరం.దారుణం !ఎందుకు చంపేడు?అచ్చెప్పునాకు ?"అన్నాడు బసవరాజు.

“కుట్టి తన బావమరిదికి నాయర్ ఇండస్ట్రీస్ లో ఉద్యోగం యివ్వమని అడగడానికి వచ్చి అనవసరంగా ఉద్రేకం తెచ్చుకుని నాయర్ని దారుణంగా హత్య చేసేడు "చెప్పాడు చక్రపాణి.

ఆ వార్త వినగానే బసవరాజు షాకు తిన్నాడు. షాకు తిని దిగులుపడ్డాడు. దిగులుపడి నీరసంగా అన్నాడు. “మిస్టర్ పాణీ!నా మనసు చెడిపోయింది.”

“నేచురల్లీ సార్.బావమరిదికి ఉద్యోగం అడగడానికి వచ్చి ఫ్రండు ప్రాణం తీస్తే మీ మనసు బాగుంటుందని ఎలా అనుకుంటాను సార్ ?డెఫినిట్ గా చెడిపోయి వుంటుంది!అవున్సారు మీకెవరైనా ఫ్రండున్నారా సార్ ?” అంటూ అడిగాడు చక్రపాణి.

“చాలామంది వున్నారు మిస్టర్ పాణీ "దిగులుగా అన్నాడు బసవరాజు.

“నేనేడుగుతున్నది మామూలు ఫ్రండ్సు గురించి సార్!ఉద్రేకం ఉద్రేకం ఎక్కువగా వున్న ఫ్రండ్సు గురించి కాదు " దిగులుగా అన్నాడు బసవరాజు.

“హు!ఉన్నదంతా వాళ్ళే !ఉద్రేకం బ్రాండు!అదేగా నా విచారం!”

“వాళ్లకి బావమరుదులు కూడా వున్నారా సార్ "

“వుండే వుంటారు "

“అయితే సర్!తమరు జాగ్రత్తగా వుండాలి!ఈ రోజుల్లో ప్రండ్ షిప్ కి అర్థం లేకుండా పోయింది. వున్నదంతా ఉద్రేకమే!కొచ్చిన్లో నిన్న ఈ దారుణం జరిగితే ఇవాళో రేపో ఇక్కడ జరగొచ్చు.మేటారాఫ్ టైం తప్ప అక్కడా ఇక్కడా మేటరంతా ఒకటే కావచ్చు "

“మిస్టర్ పాణీ "

“సర్ "

“నాకోసం నా ప్రండేవరొచ్చినా నా గదిలోకి పంపించకు!”

“పంపను సార్ "

“ఆ ప్రండుకి బావమరిది వున్నాడంటే అస్సలు పంపించకు "చెప్పాడు బసవరాజు.

“ఎట్టి పరిస్థిల్లోనూ పంపను సార్ "అన్నాడు చక్రపాణీ.

“ఆ బావమరిది ఉద్యోగం కోసం వచ్చేడని తెలిస్తే "

“చచ్చినా పంపించను సార్"

“బసవరాజు అండ్ కంపెనీలో బసవరాజు గారి ప్రండ్స్ తాలుకూ బావమరుదులకు ఉద్యోగాలు లేవని చెప్పు "

“ఆ విషయం నాకు వదిలేసి తమరు నిశ్చింతగా వుండండి సార్ "చెప్పాడు చక్రపాణి .

*****

బసవరాజు అండ్ కంపెనీలో. బసవరాజు గారి ఫ్రండ్సు తాలుకూ బామ్మర్దులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని స్వయంగా బసవరాజు గారే యీసుకున్న నిర్ణయం తెలీని రంగనాధం తనింట్లో ముస్తాబవుతూ అంటున్నాడు.

“ఈ ఊళ్లోనే బసవరాజని నాకో మంచి ఫ్రండున్నాడు " తాను ఆశించే సందర్భం దగ్గిరపడుతుందనే ఆనందంతో వేణు చిన్న ముక్తాయింపు ప్రయోగించాడు.

“బసవరాజా!ఈ పేరేక్కడో విన్నట్టుంది బావా "అని. ఎక్కడో విన్నట్టుందనే మాటకి రంగనాథం రుద్రుడయ్యేడు.

“అంతేరా అంతే.నా ఫ్రండ్సందరూ ఆఫ్టరాల్ గాళ్ళే.మోస్ట్ కామన్ నేమ్స్ పెట్టుకుంటారు.అంచేత ఆ పేరు ఎక్కడో విని వుంటావ్!బసవరాజు టైర్స్,బసవరాజు ట్యూబ్స్,బసవరాజు టేర్సండ్ ట్యూబ్స్, సమస్తమైన ఇండస్ట్రీస్ అన్నీ ఎవరిని అనుకుంటున్నావ్ ?”

“డిఫినిట్ గా బసవరాజు గారివే "

“అవునా!వాడ్ని నేను బసవడూ అంటాను.బసినీ అని పిలుస్తాను "

“వారు నిన్నేమని పిలుస్తారు ?” ఆ మాటకి రంగనాథానికి మళ్ళా కోపమొచ్చింది. అందుకే మంట మీద అన్నాడు "అది నీకనవసరం!నీక్కావలసింది వాడి ఇండస్ట్రీస్ లో ఉద్యోగం!అంతేగాని వాడు నన్ను ఏ పేరుతో పిలుస్తాడు.ఏ చేత్తో కొడతాడు.ఏ కాల్తో తంతాడు.ఈ వివరాలు నీకు అనవసరం!ఆ పనులేవో నేనూ వాడూ చూసుకుంటాం!నీక్కావలసింది ఉద్యోగం "

“ఈ ఊళ్ళో ఉద్యోగం !”

“వాడి ఇండస్ట్రీస్ వున్నవి సాక్షాత్తు ఈ ఊళ్లోనే!రంగూన్లోనో,రావల్సిండిలోనూ కాదు.ఇక్కడే ఈ హైదరాబాద్లోనే "

“థ్యాంక్స్ బావా !మంచి ఫ్రండు అంటున్నావు కదా తప్పకుండా యిస్తాడు మంచి ఉద్యోగం "

“చచ్చినట్టు యిస్తాడు.అయినా నీకు మాత్రం తక్కువేమిట్రా?ఈ రంగనాథానికి స్వయంగా బావమరిదివి!ఈ క్వాలిఫికిషన్ చాలు!పైగా ఎం.ఎ.చేసి,ఎం.బి.ఎ. కూడా చదివేవ్!నాకోసం నాగపూర్ ఉద్యోగాన్ని ఆఫ్టరాలని తీసిపారేసేవ్!ఇంత త్యాగం చేసిన వాడివి ఇన్ని క్వాలిఫికిషనలు వున్నవాడివి.నీకు తగిన ఉద్యోగం ఇవ్వలేడా ఆ బసివిగాడు ?”ఇంత గట్టి హామీ యిస్తున్న బావగారి మీద ఆ బావమరిదికి శ్రద్ధ ఎక్కువగా పెరిగిపోయిన కారణంగా బావగారి చొక్కాకి గుండీలు పెడుతూ అన్నాడు వేణు.

“ఇచ్చుకుంటాడు బావా!తప్పకుండా ఇస్తాడు !నీకెందుకు నువ్వెళ్ళిరా !”

“వెళ్లి రమ్మని దీవించి పంపితేగాని జరగదనుకుంటున్నావా?ఫోన్...ఫోన్ చాలురా!వాడి మొహం చూడకుండానే ఫోన్ కొట్టి ఉద్యోగం వేయించగలను!కాకపొతే వాడిని చూసి వారం దాటింది గదాని స్వయంగా వెడదామనుకుంటున్నాను "

“థ్యాంక్స్ బావా!వెళ్ళిరా " అని వేణు తన బావగారికి చేతులు జోడించేడు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)