ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శ్రీమతి శివకుమారి దంపతులకు జన్మించి, యంగ్ రెబల్‌స్టార్‌గా అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్న ఆరడుగుల, రెండంగుళాల ఎత్తున్న ఆజానుబాహుడు, యువ హీరో ఉప్పలపాటి ప్రభాస్ రాజు జన్మదినం అక్టోబర్ 23వ తేదీ. ప్రభాస్‌కి ప్రభోధ్ అనే అన్నయ్య, ప్రగతి అనే సోదరి ఉన్నారు. జయంత్.సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన "ఈశ్వర్'' ప్రభాస్ తొలి చిత్రం. ఈ చిత్రంలో అతని సరసన ప్రముఖ సీనియర్ హీరోయిన్ మంజుల కుమార్తె శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తర్వాత సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన "రాఘవేంద్ర'' రెండవ చిత్రం కాగా, సుమంత్ ఆర్ట్స్ పతాకంపై, యమ్.యస్. రాజు, శోభన్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా నటించగా నిర్మించిన "వర్షం'' చిత్రం ప్రభాస్‌కి స్టార్ ఇమేజ్‌నిచ్చింది. ఆ తర్వాత "ఛత్రపతి, చక్రం, అడవిరాముడు, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా'' వంటి చిత్రాలతో నటించితనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేపే "ఏక్‌నిరంజన్"గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ వివరించిన "ఏక్‌నిరంజన్'' వివేషాలు మీ కోసం...
తెలుగువన్-: "ఏక్‌నిరంజన్"లో మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన పాయింట్? ప్రభాస్-: హీరో క్యారెక్టర్ ఇంతకుముందు ఏ సినిమాలో చూడని తరహాలో ఉంటుంది. ఇలాంటి పాత్ర మన భారతీయ సినిమాల్లో భాగంగా ఏక్‌నిరంజన్‌లో చూపించడం తొలిసారి. పైకి రఫ్‌గా కనిపించే ఈ క్యారెక్టర్‌లో అండర్ కరెంట్ ఓ ఫీల్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చేసింది. నాకు ఆర్టిస్టుగా మంచి తృప్తి కలిగించిన పాత్ర అది. తెలుగువన్-: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "బుజ్జిగాడు" తర్వాత చేసిన సినిమా కదా? మీ ఫీలింగ్ ఏమిటి? ప్రభాస్-: మా కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలుంటాయి. "ఏక్‌నిరంజన్" ఆ అంచనాలను అధిగమిస్తుంది. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఇక పూరీ జగన్నాథ్ విషానికి వస్తే ఆయన నా డార్లింగ్ (నవ్వుతూ...). ఆయనతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ. మళ్ళీ సినిమా చేద్దామని ఆయన అంటే.. వెంట వెంటనే చేయడానికి నేను రెడీ. తెలుగువన్-: ఏక్‌నిరంజన్ మ్మూజిక్ గురించి మీ అభిప్రాయం? ప్రభాస్-: మణిశర్మ "బిల్లా"లో బొమ్మాలీ పాటను సూపర్‌హిచ్ చేశారు. "ఏక్‌నిరంజన్"లో అన్ని పాటలు బాగా చేశారు. ముఖ్యంగా "ఏక్‌నిరంజన్" టైటిల్ సాంగ్ నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్ అవుతుంది. 'వర్షం' తర్వాత నాకు మళ్ళీ మంచి మ్యూజికల్ హిట్‌గా 'ఏక్‌నిరంజన్' నిలబడుతుంది.
తెలుగువన్-: ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది? ప్రభాస్-: రగ్‌డ్‌గా ఉంటుంది. స్టన్ శివ యాక్షన్ చాలా బాగా తీశారు. ప్రతి సీన్‌లోనూ ఏదో ఒక యాక్షన్ ఉంటుంది. ఈ కథ కూడా అలాంటిదే. ముఖ్యంగా 'ఏక్‌నిరంజన్' క్లైమాక్స్ సినిమాకు హైలైట్. తెలుగువన్-: ఆదిత్యారామ్ పతాకంపై తొలిసారి చేశారు కదా? ఆ అనుభవం ఎలా ఉంది? ప్రభాస్-: ఆదిత్యారామ్ మంచి టేస్ట్ వున్న నిర్మాత. చాలా లావిష్‌గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా "ఏక్‌నిరంజన్" తీశారు. ఈ బ్యానర్‌పై చేయడం చాలా హ్యాపీ. 'ఏక్‌నిరంజన్' ప్రమోషన్ కూడా అలాగే భారీగా చేస్తారని ఆశిస్తున్నాను. తెలుగువన్-: మీ తదుపరి చిత్రాల గురించి? ప్రభాస్-: కరుణాకర్ దర్శకత్వంలో, ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్, అరకులో ఓ షెడ్యూల్ ఉంటుంది. వేసవికానుకగా ఈ చిత్రం విడుదలవుతుంది. ఓ నెలరోజుల్లో దిల్‌రాజు, దశరథ దర్శకత్వంలో నిర్మించే మరో చిత్రం ఆరంభమవుతుంది. ఈ రెండూ లవ్, ఫ్యామిలీ, యాక్షన్ అంశాలున్నవి. ఈ సినిమాల తర్వాత రాఘవేంద్రరావు నిర్మాతగా, రాజమౌళి దర్శకత్వంలో మూడో సినిమా చేస్తాను. తెలుగువన్-: ఏక్‌నిరంజన్ హైలైట్స్ ఏమిటి? ప్రభాస్-: హీరో క్యారక్టరైజేషన్, పూరి డైలాగ్స్, మ్యూజిక్, యాక్షన్.. ఇలా అన్ని హైలైట్సే. మొత్తంగా చెప్పాలంటే.. పూరి అందించే మంచి కమర్షియల్ ప్యాకేజి "ఏక్‌నిరంజన్" అంటూ ఇంటర్వ్యూను ముగించారు. prabhas in TeluguOne