పరిచయం : రజనీకాంత్ నటించిన "చంద్రముఖి'' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ నయనతార బర్త్ డే ఈ రోజు. తన నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ... స్టార్ అండ్ యూత్ హీరోలతో వరుసగా నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. అంతే కాదు స్టార్‌డమ్‌తో పాటు ఎన్నో రూమర్స్‌కు కూడా గురవుతూనే వుంది ఈ అందాల ముద్దబంతి నయనతార. ఈమె కోలీవుడ్ నటి. ఈమెది మంచి పర్షనాలిటీ, ఎత్తు:5'4", అందగత్తె. మళయాలమ్ సినిమా "Manassinakkare" తో చిత్రసీమ ఆరంగేట్రము చేసారు. పరిశ్రమ లో నానాటికీ ముందుకు దూసుకు పోతున్న తార నయనతార కొన్ని సార్లు ఉన్నది ఉన్నట్లు గా ముఖాన మాట్లాడేస్తే , ఇంకొన్నిసార్లు నెలల కొద్ది మౌనం గా ఉండిపోతుందట. అదో రకము.
ప్రొఫైల్ : * పేరు : నయనతార, * పుట్టిన ఊరు : కేరళ లోని 'తిరువల్ల'(పతనంతిట్ట జిల్లా) * పుట్టిన తేది : 18-నవంబర్-1984 న జన్మించారు. * అసలుపేరు : "డయానా మరియం కురేన్". * నిక్ నేం : మని , నయన్ * ఎత్తు : 5' 4'' * మాతృ భాష : మలయాళం , * మతము : క్రిస్టియన్ * తల్లి : ఓమన కురేన్. * తండ్రీ : కురియన్ కోడియట్టు-an Air Force Official. * బ్రదర్ : అన్నయ్య - 'లేను కురేన్.- ఇంజనీర్ . * చదువు : B.A. Literature-మారతమ కాలేజీ ,కేరళ * మొదటి ఫిల్మ్ : మనస్సినక్కరే (తమిళ్) * మొదటి హీరో : జయరాం , * మొదటి దర్శకుడు : సత్యన్ అన్తికాద్ , * మొదటి నిర్మాత : సుబీర్ , * మొదటి స్క్రీన్ : యాడ్ -ఫిల్మ్ ఇన్ మలయాళం.
నయన తార నటించిన తెలుగు చిత్రాలు * చంద్రముఖి * లక్ష్మీ * బాస్ * వల్లభ * యోగి * దుబాయ్ శీను * గజిని * తులసి * కధానాయకుడు * సెల్యూట్ * ఆంజనేయులు * మల్లికా ఐ లవ్ యూ * ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "అదుర్స్''